మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
సూర్య ప్రభా: శేరిలింగంపల్లి: మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ పై నుండి దూకి ఓయువతి ఆత్మహత్య కు పాల్పడింది..ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ప్రాథమిక సమాచారం మేరకు జనప్రియ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండే బోరుగడ్డ శ్రుతి (35) ఎంఫార్మసీ చదువుతున్నది కాగా ఆమెకు ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా కుదరక పోవడంతో శృతి డిప్రెషన్ లో ఉన్నది. ఈ క్రమంలో ఉదయం 11 గం లకు అపార్ట్మెంట్ 4 వ అంతస్తు పై నుంచి దూకింది. స్థానికులు గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం యువతిని మియాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర రక్త స్రవంతో ఉన్న యువతి అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు….హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు.