కుత్బుల్లాపూర్ సూర్యప్రభా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలోజర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయి. అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈనేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ సోమవారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అందులో భాగంగా కింది సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సమస్యలు 1. ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రీవ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలి. జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కొత్త విధానం ద్వారా ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఉద్యోగుల మాదిరిగా అమలుచేయాలి. జర్నలిస్టుల కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసింది. వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలి. మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు రాత్రి పూట రవాణా సదుపాయం కల్పించాలని కోరారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంపానెల్మెంట్లో చేర్చాలి.జర్నలిస్టుల దయనీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే పై సమస్యలను పరిష్కరించేలా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హరి ప్రసాద్, మేడ్చల్ జిల్లా కోశాధికారి బెలిదె అశోక్, కుత్బుల్లాపూర్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డమీది అశోక్, పి.శంకర్, ఇ సంజీవరెడ్డి వెంకట్ జ్యోతి రిపోర్టర్ పల్లె వాణి సీఈవో ఎం ఎస్ చారి ఆకుల రమేష్ ప్రెసిడెంట్ పబ్బు మల్లేష్ గౌడ్, ఉప్పల్ ప్రెసిడెంట్ జి.కృష్ణ, కూకట్ పల్లి కట్టెల మల్లేష్, దామెర జగదీశ్వర్ గుప్తా, పటేల్ నరసింహా, గోవిందరావు, శివ కుమార్, శివకుమార్ గౌడ్, సంజీవరావు. కుమార్ గౌడ్, బోల్లమల్ల నర్సింగరావు, దుర్గారావు, రోజారామణి. శివపార్వతి, రజిని, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

