
బాన్సువాడ సూర్య ప్రభా: బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మంజూరైన బిల్లుల చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి .కోటగిరి మండల కేంద్రం AS ఫంక్షన్ హాల్లో మరియు బాన్సువాడ పట్టణంలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ బిల్లు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు.
ఈసందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ……..
రాష్ట్రంలో అత్యధికంగా 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ.ఇందులో 4000 ఇళ్ళను కాంట్రాక్టర్ల ద్వారా నిర్మిస్తే, మిగతా 7000 ఇండ్లను లబ్ధిదారులు స్వంతంగా కట్టుకున్నారు.స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టుకునే GO ఈరోజుకు కూడా రాష్ట్రంలో లేదు. అయినా మొండి దైర్యం, పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో బాన్సువాడ నియోజకవర్గంలో నేను మొదలు పెట్టాను.పేదలు కట్టుకుని సంతోషంగా ఉన్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వంలో 93 శాతం వచ్చాయి.ఇంకా కేవలం ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి.నేను కాంగ్రెస్ పార్టీలో చేరే రోజు కూడా బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరాను.రైతులకు రుణమాఫీ అమలు జరుగుతున్న కఠిన పరిస్థితులలో కూడా ప్రస్తుతం ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.బిల్లులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు.కొద్ది రోజుల్లోనే మిగితావి కూడా వస్తాయి. లబ్ధిదారులకు అందిస్తాం.గత పదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఇంకా కొన్ని పనులు మధ్యలో ఉన్నాయి. నేను రిటైర్ అయ్యే లొపు మొదలు పెట్టిన పనులు పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే నా ఆశయం. పార్టీ మారే రోజు కూడా నాకు మంత్రి పదవి అవసరం లేదు, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వమని కోరాను. ముఖ్యమంత్రి అంగీకరించారు.పార్టీ మారడంలో నాకు ఎలాంటి స్వార్థం లేదు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను.
