హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 68,990గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 68, 990గా ఉంది.
హైదరాబాద్ సూర్య ప్రభా: హైదరాబాద్: బంగారం అంటే మహిళలకు మక్కువ ఎక్కువ. వివిధ ఆభరణాలు ధరించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో డిఫరెంట్ జ్యువెల్లరి ధరించి ధగధగ మెరుస్తుంటారు. ఆషాఢ మాసంలో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత తులం బంగారంపై రూ.10 వేల వరకు తగ్గింది. వచ్చేది శ్రావణ మాసం, అందులో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఇంకేముంది ఆ సమయంలో శుభకార్యాల కోసం కొందరు ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తున్నారు. బంగారం కొని, ఆభరణాలకు ఆర్డర్ ఇస్తున్నారు. సోమవారం రోజున బంగారం ధర మరింత తగ్గింది. ముందు ముందు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.65 వేల వరకు తగ్గొచ్చని వివరించారు. హైదరాబాద్‌లో ఇలా..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 68,990గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 68, 990గా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది. ఢిల్లీ, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400గా ఉంది. ఢిల్లీలో ఇలా..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,390గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 69,140గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.68,990గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,640గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 70,520గా ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.68,990గా ఉంది.