Home తాజా వార్తలు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోమట్టి గణపతుల వితరణ

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోమట్టి గణపతుల వితరణ

0

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)
మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జె హెచ్ 143) అధ్యక్షుడు సుధీర్ మంకాల పేర్కొన్నారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీ మార్కెట్ రోడ్డు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ప్రాంగణంలో ఉచిత మట్టి గణపతులను భక్తులకు అందజేశారు. సందర్భంగా సుధీర్ మంకాల మాట్లాడుతూ ఇప్పటికే చెరువులు కాలుష్యమైపోతున్నాయని వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు ఇతర కెమికల్స్ తో చేసిన గణపతులు పూజించి చెరువులో నిమజ్జనం చేయడం వలన చెరువులు మరింత కలుషితమయ్యే ప్రమాదం నెలకొని ఉందని, దానికోసం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం చేస్తున్న కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులను వారికి అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించి పర్యావరణం కాపాడాలని ఉద్దేశంతో మట్టి గణపతులను అందరికీ ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. తమకు సహాయ సహకారాలు అందించిన సుధీర్ మంకాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారులు సర్వేపల్లి రమేష్ కుమార్, సంఘ సభ్యులు ఆలయ ప్రధాన పూజారి చక్రధారి శ్రీరామ శర్మ, సింహాచలం శ్రీధరాచార్యులు, హరి రాఘవేంద్ర, టెమ్జూ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి తో పాటు శ్రీ విజయ దుర్గ దేవాలయం కమిటీ చైర్మన్ వెంకట స్వామి, ప్రధాన సభ్యులు యాదగిరి, శ్రీనివాస్, సత్యనారాయణ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here