
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ గోష్ కమీషన్ విచారణకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవనున్న నేపథ్యంలో గులాబీ దళపతి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో బిఆర్కే భవన్ కు తరలివెళ్లగా, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బిఆర్కే భవన్ వరకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
