
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)కొంపల్లి మున్సిపాలిటీ పరిధి జయభేరి పార్క్ కాలనీలోని సీతారామ సంజీవని అంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టించి నేటితో మండలం (41 రోజులు) పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన అభిషేక, హోమ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అంజనీపుత్ర హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అంజనీ సుతుడు అయినా ఆంజనేయుడు లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని తీసుకొచ్చాడని, అంతటి పరాక్రమవంతుడైన ఆంజనేయుడు తిరిగి జయభేరి నందు సంజీవని ఆంజనేయుడిగా ప్రతిష్టించబడ్డాడని, స్వామివారి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వాసుదేవా రెడ్డి, జీవన్ రెడ్డి, వినోద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బాగా రెడ్డి, మన్మోహన్ పాండే, సుభాష్, సీతారామరాజు, పిఎస్ఎన్ రాజు, శేఖర్ రెడ్డి, గిరి, శ్రీధర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.