
జన హృదయ నేత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి75వ జయంతి సందర్బంగా ఘన నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి..

కుత్బుల్లాపూర్ (సూర్యప్రభా) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దివంగతనేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి75వ జయంతిని పరిష్కరించుకొని షాపూర్ నగర్ చౌరస్తాలో వైయస్సార్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ . ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ,ఉచిత విద్యుత్తు వంటి గొప్ప పథకాలను మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు డా.వైఎస్ఆర్ ఎప్పటికి తమ గుండెల్లో పెట్టుకుంన్నారు . పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరువులు వైయస్సార్ అభిమానులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, యూత్ & ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, ఎస్ సి & ఎస్ టి సెల్ నాయకులు, ఐ ఎన్ టీ యు సి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా పాల్గొన్నారు..