
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోసోమవారం 129 – సూరారం డివిజన్ అంబేద్కర్ ఎస్సీ మహిళా కమ్యూనిటీ హాల్ భవనం నందు స్వయం శక్తి గాజులరామారం పట్టణ మహిళా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే అటు దేశం, ఇటు కుటుంబం పురోగతి సాధిస్తుందన్నారు. అంతేకాక మహిళలంతా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అందరికీ తెలియజేస్తూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఎర్వ శంకరయ్య, మాజీ కౌన్సిలర్ కిషన్ రావ్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు భాస్కర్, మద్దెల సత్యనారాయణ, ప్రశాంత్, మహిళా సంఘం నాయకురాలు దేవ కరుణ, సంధ్య, షబానా, భ్రమరాంబ, అరుణ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.