
కుత్బుల్లాపూర్(సూర్య ప్రభా) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ గాజులరామారం పరిధిలో ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో గత సంవత్సరము చదివినటువంటి పదవ తరగతి విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించినటువంటి ముగ్గురు విద్యార్థి విద్యార్థులకు బుధవారం స్కూల్ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి మరియు బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి ఆధ్వర్యంలో గుంటుపల్లి శ్రీనివాసరావు, గుడివాడ సురేష్ కుమార్, సురేంద్ర ఒక్కొక్క విద్యార్థికి 5000 రూపాయలు నగదును బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా విద్యను అభ్యసించాలని అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని కృషి పట్టుదల అనే సంకల్పంతో విద్యను అభ్యసించి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష ,వంశీ, డివిజన్ అధ్యక్షులు సాయినేత, మురళీకృష్ణ, లక్ష్మణ్, వినయ్ కుమార్, శంకర్ ప్రతాపరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు
