Home తాజా వార్తలు మల్లారెడ్డి యూనివర్సిటీ 2024 బ్యాచ్ విద్యార్థులకు ఐసిఐసిఐ బ్యాంక్ సంయుక్తంగా గుర్తింపు కార్డ్ అందుచేత..

మల్లారెడ్డి యూనివర్సిటీ 2024 బ్యాచ్ విద్యార్థులకు ఐసిఐసిఐ బ్యాంక్ సంయుక్తంగా గుర్తింపు కార్డ్ అందుచేత..

0

కుత్బుల్లాపూర్ సూర్యప్రభా : మల్లారెడ్డి యూనివర్సిటీలో ఐసిఐసిఐ బ్యాంక్ వారి సహకారంతో 2024 ప్రథమ సంవత్సరం బ్యాచ్ కు చెందిన 400 మంది విద్యార్థులకు ఐడి కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి ఎస్ కే రెడ్డి ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నతాధికారులు రాహుల్ గోడ్సే, శివ పాలపర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఐడి కార్డు ఎంతో ఉపయోగపడుతుందని.. దేశంలోని తొలిసారి మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వినూత్న మరియు సృజనాత్మక ప్రయోగం చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించబోతుందని తెలిపారు. గుర్తింపు కార్డులో చెప్పు ని అమర్చి తద్వారా విశ్వవిద్యాలయంలో గ్రంథాలయంలో మరియు హాస్టల్లో విద్యార్థి హాజరును ఆటోమేటెడ్ పద్ధతిలో నమోదు చేయబోతున్నామని తెలిపారు. దీనివలన విశ్వవిద్యాలయం సిబ్బందికి మరియు విద్యార్థులకు సమయం సద్వినియోగం అవుతుందని అన్నారు. ఈ గుర్తింపు కార్డు బహుళ ప్రయోజనకారిగా ఉండేలాగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయం మరియు ఐసిఐసిఐ బ్యాంకు సంయుక్తంగా అభివృద్ధి చేశాయని అన్నారు ఆర్ఎఫ్ఐడి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ కార్డుని డెబిట్ కార్డుగా ఉపయోగించి సుమారు ఐదు లక్షల రూపాయల పరిమితికి లోబడి నగదు లావాదేవీలు నిర్వహించవచ్చుని అదేవిధంగా ట్యూషన్ రుసుము పరీక్షా రుసుము వంటివి ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చని వివరించారు. గుర్తింపు కార్డు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనూ మరియు బయట కూడా విద్యార్థులు జరిపే అన్ని రకాల డిజిటల్ లావాదేవీలకు ఈ డెబిట్ కార్డు వినియోగించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ ఆచార్య ఆంజనేయులు ప్రథమ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల విభాగాధిపతి డాక్టర్ సుజిత్, స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ఆచార్య ధనుంజనాచారి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here