Home తాజా వార్తలు సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి…

సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి…

0

కుత్బుల్లాపూర్ సూర్య ప్రభా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ లెనిన్ నగర్ ప్రాంతంలో సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గాజులరామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత అధ్యక్షతన భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి హాజరవ్వడం జరిగింది. కార్పొరేటర్ రావుల శేషగిరి లెనిన్ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి వీధి తిరుగుతూ ప్రతి ఒక్కరిచే సభ్యత్వ నమోదు నిర్వహించడం జరిగింది. డివిజన్లోని నాయకులు కూడా వారి వారి ప్రాంతాల్లో వారి వారి బసీలలో రానున్న రెండు రోజులు ఉద్యమంల సభ్యత్వాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ పాటిల్ , జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ , డివిజన్ కార్యదర్శి జి శ్రీనివాస్ నేత , డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ , సీనియర్ నాయకులు గోవర్ధన్ ,నరేష్ గౌడ్ ,కుమార్ , వీరాచారి ,చెంప తదితరులు పాల్గొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here