Home తాజా వార్తలు అనాధ పిల్లల చేతుల మీదుగా ‘పద్మరాగ రెస్టారెంట్ & బాంక్వెట్’ ప్రారంభోత్సవం

అనాధ పిల్లల చేతుల మీదుగా ‘పద్మరాగ రెస్టారెంట్ & బాంక్వెట్’ ప్రారంభోత్సవం

0

– చిన్నారులకు బ్యాగ్స్, యూనిఫామ్స్ పంపిణీ

- వ్యాపారంలోనూ సామాజిక బాధ్యత

– ఇక ఈ రెస్టారెంట్ నోరూరించే రుచులకు నెలవు

కుత్బుల్లాపూర్ సూర్యప్రభా : హైదరాబాద్, నవంబర్ 6, 2024: భోజన ప్రియులకు నోరూరించే ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా కొంపల్లిలోని డీ మార్ట్ వద్ద ఆధునికరించిన ‘పద్మరాగ రెస్టారెంట్ & బాంక్వెట్’ ను ఆదర్శ ఫౌండేషన్‌కు చెందిన అనాధ పిల్లల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, పుస్తకాలు, షూస్ పంపిణీ చేశారు. పిల్లలకు రెస్టారెంట్‌లోని రుచికరమైన వివిధ రకాల వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగా పద్మరాగ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటుందన్నారు. ఆదర్శ ఫౌండేషన్ చిన్నారులు రెస్టారెంట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చర్య సమాజం పట్ల పద్మరాగకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందించడమే‌ కాకుండా సామాజికంగా సానుకూల ప్రభావాన్ని చూపించడం కూడా మా లక్ష్యమన్నారు. అహ్లాదకరమైన డైనింగ్ అనుభవాన్ని అందించనున్నామని చెప్పారు. ఈ వేదిక ఆకర్షణీయమైన, ఆధునిక శైలిలో ఉందన్నారు. అనేక రుచులలో కూడిన మెనూ కలదన్నారు. ఈ వేదికలో ఉన్న బాంక్వెట్ హాల్లో వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లు, సామాజిక సమావేశాలు చేసుకోవచ్చన్నారు. 130 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో ఇది పునరుద్ధరించబడినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ చక్రధర్, జగదీష్, ఎంవీ రావు, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

ఈ రెస్టారెంట్ ఆత్మీయమైన వాతావరణాన్ని అందిస్తుందన్నారు. సంప్రదాయ అలంకరణను ఆధునిక శైలిలో సమన్వయం చేశామన్నారు. ఆహ్లాదకరమైన లైటింగ్, ఆకర్షణీయమైన ఫర్నీచర్, అనువైన లేఅవుట్ ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. సంప్రదాయ రుచులు, ఆధునిక డైనింగ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మెనూ రూపొందించామని తెలిపారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను భోజన ప్రియులు ఆస్వాదించవచ్చన్నారు. ఈ రెస్టారెంట్‌కు విచ్చేసే అతిథులు విస్తృతమైన బఫేను ఆస్వాదించవచ్చని తెలిపారు. ఇందులో ప్రాంతీయ, అంతర్జాతీయ వంటకాల స్ఫూర్తితో అనేక రకాల స్టార్టర్‌లు, ప్రధాన కోర్సులు, డెజర్ట్‌లతో కూడిన విస్తృతమైన బఫేను ఆనందించవచ్చని చెప్పారు. తందూరీ ప్రత్యేకతలైన మాంసాహారం, పనీర్, సుగంధ మసాలాలతో కూడిన బిర్యానీలు, బటర్ చికెన్, పనీర్ టిక్కా మసాలా వంటి రిచ్, ఫ్లేవర్‌ఫుల్ కర్రీలు, ప్రత్యేక శాకాహార, మాంసాహార వంటకాలు కలవన్నారు. గులాబ్ జామూన్, రస్ మలై వంటి సంప్రదాయ రుచులు, సమకాలీన డెజర్ట్స్ ఉన్నాయని చెప్పారు. భోజన ప్రియులకు‌ ప్రతి సందర్శన ప్రత్యేకంగా ఉంచేందుకు మెనూలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. సీజనల్ స్పెషల్ డిష్‌లు, ప్రముఖ వంటకాలు ఉన్నాయన్నారు. దీంతో మళ్లీ మళ్లీ వచ్చేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు. పద్మరాగ ప్రస్తుతం కేపీహెచ్బీ, కొంపల్లి, కొండాపూర్‌లో ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు. ప్రతి సందర్శనను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో అనుభవించదగ్గ జ్ఞాపకంగా మార్చడం మా లక్ష్యమన్నారు. పద్మరాగను భోజన ప్రియులకు ప్రీతిపాత్రమైన గమ్యస్థానంగా నిలిపడమే ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఫౌండేషన్‌కు చెందిన యాబై మంది పిల్లలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here