కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయండి :
ప్రజాస్వామ్యం పరిణవిల్లేల కులగణన తో ప్రజా ప్రాతినిధ్య రిజర్వేషన్లు:
ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
సూర్య ప్రభా : ఉదయపూర్ డిక్లరేషన్ తో దేశంలో ఎక్కడలేని విధంగా సామాజిక న్యాయం, బహుజనులకు ప్రజాప్రతిని రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రంలో కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న కుల గణనను ప్రతిష్టాత్మంగా తీసుకొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్షతన సాగిన కుల గణన, సామాజిక ,ఆర్థిక ,విద్య, ఉపాధి రాజకీయ సమగ్ర ఇంటింటి కులగణన సర్వే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా స్థాయి సన్నాక కార్యక్రమ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కూన శ్రీశైలం గౌడ్ సీనియర్ నాయకులు కొలను హనుమంత రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితరుఅన్ని వర్గాల ప్రజలకు ప్రజాప్రతినిధ్యంలో ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాన ప్రాతినిధ్యం కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ కుల గణన దేశానికి రోల్ మోడల్ కావాలన్నారు.
జెడ్పిటిసి చైర్ పర్సన్& మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, కూన శ్రీశైలం గౌడ్ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలు కొలన్ హన్మంత్ రెడ్డి, జంగయ్య యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, బండి రమేష్ తదితరులు మాట్లాడుతూ సీఎం చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని మహా యజ్ఞంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
డాక్టర్ జి. వి. వెన్నెల , డిసిసి అధ్యక్షులు కే. యమ్ ప్రతాప్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు జోష్ణ శివారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు భవాని, మరియు జిల్లా నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.