పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలను నాటిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు మరియు జగద్గిరిగుట్ట సీఐ నరసింహ
పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
వృక్షో రక్షతి రక్షితః
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ లోని చిత్తారమ్మ దేవి నగర్ లో గల శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ నందు పర్యావరణ దినోత్సవ
వేడుకలు ఘనంగా జరిగాయి.
టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ సొంటి రెడ్డి పున్నారెడ్డి మరియు జగద్గిరిగుట్ట సిఐ నరసింహ మొక్కలు నాటి పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ సొంటి రెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా చెట్లను నాటితే అవే ప్రగతికి మెట్లు అని నినదించారు. అదేవిధంగా పిల్లలందరూ తమ పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటినట్లయితే భావితరాలకి స్వచ్ఛమైన పర్యావరణం ఇవ్వవచ్చని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ వైస్ చైర్మన్ శ్రీమతి చైతన్య పున్నారెడ్డి గారు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
