దేవతారాధనతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …_
గురువారం 130 – సుభాష్ నగర్ డివిజన్ జీడిమెట్ల రాంరెడ్డి నగర్ లోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి, ఆంజనేయస్వామి, నవగ్రహ దేవతల చతుర్దశ 14వ వార్షికోత్సవం, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతల తృతీయ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కార్యసిద్ధి కలిగించే దైవం లక్ష్మీ గణపతి స్వామి అని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు సాయి కిరణ్,
శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సలహాదారులు వామన్ గుప్తా, రామలింగం గుప్తా, అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోవిందరావు, కోశాధికారి చంద్రమౌళి గుప్తా, మాధవరావు, ఉపాధ్యక్షులు బాలరాజు గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
