
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్దకు వచ్చిన లెనిన్ నగర్ మరియు భూదేవిహిల్స్ ప్రజలతో కలిసి హిందూ, ముస్లిం మతాల మధ్య నెలకొన్న స్మశానవాటిక సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు..అనంతరం నియోజకవర్గం ప్రజల నుండి వచ్చిన ఆహ్వానలు,వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు..ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..లెనిన్‌నగర్,భూదేవిహిల్స్ ప్రజలు మతాల మధ్య విబేధాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు..ఉన్నత అధికారులతో మాట్లాడి, అతి త్వరలో మీ అందరి సమస్యను పరిష్కరిస్తాననిహామీఇచ్చారు..కుల,మతసామరస్యాలకు ప్రతీక మన కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు,మహిళ సంఘాలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు