
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)ఎస్సార్ నాయక్ నగర్ లో పలు సమస్యలపై కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం డిప్యూటీ కమిషనర్ నరసింహన్ మరియు వారి సిబ్బంది కాలనీకి విచ్చేసి సమస్యల పట్ల స్పందించి వారి సిబ్బందిపై సీరియస్ అయి పనితీరు మార్చుకోవాలని వారిని హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఆర్ నాయక్ నగర్ విచ్చేసిన డిప్యూటీ కమిషనర్ నరసింహన్ కి వారి సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో గుబ్బల లక్ష్మీనారాయణ,ఆలూరి వెంకట శేషాచారి, పి వీ భాస్కర్ రెడ్డి ,హరిబాబు యాదవ్,పూర్ణ చందర్ గుప్త,శ్యామ్,కూరపాటి ప్రభాకర్ గారు మరియు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు