Home Blog Page 2

శ్రీ రామాంజనేయ యువజన సంఘం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.యం ప్రతాప్..

కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం శ్రీ దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో,శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో,శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రీ రామాంజనేయ యువజన సంఘం చైర్మన్,కె.యం.ప్రతాప్ విచ్చేసి,అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో,శ్రీ రామాంజనేయ యువజన సంఘం సభ్యులు, కుత్బుల్లాపూర్ గ్రామ వాసులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును సన్మానించిన దమ్మని శ్రవణ్ కుమార్..అవిజే జేమ్స్

కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం తెలంగాణ రాష్ట్ర ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబుని కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి డి.సి.సి ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్,ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజ జేమ్స్ తదితరులు.

తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు… నర్సారెడ్డి భూపతిరెడ్డి

కుత్బుల్లాపూర్ : సూర్య ప్రభా తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు

కుత్బుల్లాపూర్ సూర్య ప్రభా
యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు.రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు,యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ చానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ ఆక్ట్ కింద నమోదు కావటం యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకి కూడా అలాంటి నియమనిబంధనలే ఉన్నాయన్నది గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపుకు అనుసరించాల్సిన అంశాల పై ఈ కార్యక్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు అయినందున వాటిని అమలుపర్చాల్సిన కర్తవ్యం యూట్యూబ్ చానెల్స్ పై ఉందని సమావేశం అభిప్రాయబడింది. అకాడమీ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ హర్షం వెలిబుచ్చారు. ఇంకా దీనిపై నిర్దిష్ట చర్యలు జరపడానికి మరిన్ని చర్చలు జరపాలని, రౌండ్ టేబుల్ లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇది మొదటిదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అంశం పై ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు.

భావస్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి, జర్నలిజం వృత్తికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు వార్తలు, చర్చా గోష్టిలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ సంస్థలను మాత్రమే మీడియా సంస్థలుగా గుర్తించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సబ్ స్కయిబర్స్, వ్యూస్ ని ప్రధాన క్రైటేరియగా తీసుకోరాదని, ఎందుకంటే అంగట్లో సరుకుల్లాగా వాటి విక్రయం జరుగుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు. వ్యక్తిగత ఎజెండాలతో, ద్వేషాలతో, కక్ష్యపూరిత ధోరణులతో, సమాజాన్ని తప్పు ద్రోవ పట్టించే వైఖరితో ప్రసారాలు చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.ఎలాంటి చట్టబద్దత లేకుండా యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లు సృష్టించి, హద్దు అదుపు లేకుండా చెలామణి అవుతున్న వారికి గుర్తింపు ఇవ్వడం ద్వారా మీడియా వ్యవస్థకు మచ్చ కలుగుతుందని, ఇందుకుగాను సంస్థ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్, పోస్టల్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, కార్యాలయ నిర్వహణ తీరు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

సియాసత్ మేనేజింగ్ ఎడిటర్, ఎమ్మెల్సీ ఆమెరలి ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ , ముఖ్యమంత్రి సి పి ఆర్ ఓ, అయోధ్య రెడ్డి, మీడియా అకాడమీ పూర్వాధ్యక్షులు అల్లం నారాయణ, ప్రముఖ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, పద్మజా షా, ఎం. ఏ. మాజీద్, కరుణాకర్ దేశాయ్, జర్నలిస్టు సంఘాల నాయకులు విరహత్ అలీ, మామిడి సోమయ్య, పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోమట్టి గణపతుల వితరణ

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)
మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జె హెచ్ 143) అధ్యక్షుడు సుధీర్ మంకాల పేర్కొన్నారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సూరారం కాలనీ మార్కెట్ రోడ్డు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ప్రాంగణంలో ఉచిత మట్టి గణపతులను భక్తులకు అందజేశారు. సందర్భంగా సుధీర్ మంకాల మాట్లాడుతూ ఇప్పటికే చెరువులు కాలుష్యమైపోతున్నాయని వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు ఇతర కెమికల్స్ తో చేసిన గణపతులు పూజించి చెరువులో నిమజ్జనం చేయడం వలన చెరువులు మరింత కలుషితమయ్యే ప్రమాదం నెలకొని ఉందని, దానికోసం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం చేస్తున్న కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులను వారికి అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించి పర్యావరణం కాపాడాలని ఉద్దేశంతో మట్టి గణపతులను అందరికీ ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. తమకు సహాయ సహకారాలు అందించిన సుధీర్ మంకాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారులు సర్వేపల్లి రమేష్ కుమార్, సంఘ సభ్యులు ఆలయ ప్రధాన పూజారి చక్రధారి శ్రీరామ శర్మ, సింహాచలం శ్రీధరాచార్యులు, హరి రాఘవేంద్ర, టెమ్జూ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి తో పాటు శ్రీ విజయ దుర్గ దేవాలయం కమిటీ చైర్మన్ వెంకట స్వామి, ప్రధాన సభ్యులు యాదగిరి, శ్రీనివాస్, సత్యనారాయణ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కోదండరామ్ కు గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ నేతల సన్మానం.

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా నియమితులైన తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ కు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అభినందనలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆయనకు జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ను పూలబొకే, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, నాయకులు తన్నీరు శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, పులిపలుపుల ఆనందం, సీహెచ్ వీరారెడ్డి తదితరులు కూడా ప్రొఫెసర్ కోదండరాం ను సన్మానించారు.

రూ.10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే

హైదరాబాద్ సూర్య ప్రభా :ఆగస్టు 07గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమ యంలో ఉన్నారు.

దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధిం చిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు.

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్. బి.ఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టప రంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది.

ఇప్పటికే ఆర్.బి.ఐ పలు మార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేక సార్లు వ్యాపారులకు బ్యాంక ర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పది రూపా యల నాణేాలు విపణిలో చెల్లుబాటు అవుతాయని పది రూపాయల నాణాలను రద్దు చేశారంటూ అపోహలు వ్యాపింపచేయడం చటా రీత్యా నేరమని కూడా హెచ్చరించింది.

ఈ మేరకు 2016 లోనే ఆర్బిఐ పత్రిక ప్రకటన సైతం జారీ చేసింది. ఆ తర్వాత 2018 లో సైతం ఆర్బిఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో ఆర్బిఐ ఆదే శాలను బేఖాతరు చేస్తూ వస్తున్నారు.

దీంతో ఆర్బిఐ మరోసారి కఠినంగా హెచ్చరించేందుకు సిద్ధం సిద్ధమవుతుంది నిజానికి పది రూపాయల నోటు కన్నా పది రూపాయ ల నాణాలను స్వీకరించి నట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. పది రూపా యల నోట్లు వాడకం ఎక్కువగా ఉండటం వల్ల అవి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది.

వీటిని దృష్టిలో ఉంచుకొని విలువ తక్కువగా ఉన్న కారణంగా పది రూపాయల నాణాలను ఆర్బిఐ ప్రవేశ పెట్టింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో అపో హలను నమ్మి, కస్టమర్ల వద్ద నుంచి పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తున్నారు.

దీంతో పెద్ద ఎత్తున బ్యాంకులు ఆర్బీఐ చెస్టులో చినిగిన నోట్లతో పాటు రూ. 10 నాణేలను కూడా జమ చేయాల్సి వస్తోందని బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు. అంతేకాదు ఆర్బిఐ ఇప్పటికీ పది రూపాయల నాణాలను పెద్ద ఎత్తున ముద్రిస్తోంది.

భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

జమ్ము కాశ్మీర్ సూర్య ప్రభా :ఆగస్టు 07జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది.

రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం అణువణువునా గాలిస్తు న్నారు. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకూ సమాచారం లేదు.

దీనికిముందు అనంత్‌ నాగ్‌లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశాయి…

నకిలీ వైద్యులు అరెస్ట్….

వరంగల్,నర్సంపేట సూర్య ప్రభా : ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు నర్సంపేటలో ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు. తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు పట్టణానికి చెందిన కె. విజయేందర్ రెడ్డి, ఎన్. శ్యామ్ రాజ్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎలాంటి అర్హత లేకుండా వచ్చి రాని వైద్యం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ నరేశ్ హెచ్చరించారు…

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి

హైదరాబాద్ సూర్య ప్రభా:ఆగస్టు 07 తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషిం గ్టన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌ బృందం.. ఇవాళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం కానుంది.అమెరికాలో సీఎం రేవంత్‌ రెడ్డి టీమ్‌ పర్యటన కొసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటోంది. నిన్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌తో ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్‌ బృందం.. తాజాగా మరి కొన్ని కంపెనీలతోనూ డీల్‌ కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే.. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా ఆపరేషన్స్‌లో ఆర్సీసీయం హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు ముందు కొచ్చింది. ఆర్సీసీయం సీఈవో గౌరవ్‌సూరి, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌ బృందం జరిపిన చర్చల్లో కంపెనీ ఏర్పాటు ఒప్పందం కుదిరింది.ఇక.. అమెరికా వెలువల తొలిసారి హైదరాబాద్‌లో కంపెనీ చేయబోతున్నట్లు ఆర్సీసీయం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ సాయం తో తమ సేవలను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గొప్ప టాలెంట్‌ ఫోర్స్‌, సహజసిద్ధ లొకేషన్‌, స్కిల్స్‌ కలిగిన ఎంప్లాయిస్‌ అందు బాటులో ఉండడంతో హైదరాబాద్‌లో డేటా సొల్యూషన్‌ సర్వీసులను అభివృద్ధి చేస్తున్నామ న్నారు ఆర్సీసీయం సీఈవో గౌరవ్‌ సూరి. దాంతో.. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500మంది అత్యాధునికి సాంకేతిక నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు…