మియాపూర్ ఏసీపీ నర్సింహరావు..
సూర్యప్రభా, శేరిలింగంపల్లి: నకిలీ ప్రెస్ కార్డులు , రాజకీయ నాయకులమని బెదిరించి డబ్బుల వసూళ్ళకు పాల్పడిన వ్యక్తులపై కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని మియపూర్ ఏసిపి నర్సింహరావు తెలిపారు. కొందరు రిపోర్టర్లమని చిన్న చిన్న నిర్మాణదారులు, వ్యాపారుల వద్ద బెదిరించి డబ్బులు వసూళ్ళు చేస్తున్న వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందినట్లు ఏసిపి తెలిపారు. కొంతమంది నిర్మాణదారుల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రాజకీయ నాయకులు తమ పార్టీల పేరుతో వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. పాత్రికేయులు ,గల్లీ నాయకుల నుంచి నియోజకవర్గ నాయకులు వరకు బెదిరిస్తున్న వారిపై రహస్యంగా విచారణ చేపట్టి, కొందరిని గుర్తించి వారిపై నివేధికలను సిద్ధం చేశామని ఆయన పేర్కోన్నారు. అతి త్వరలో వారిపై ఆర్గనైజ్డ్ క్రైం క్రింద కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారము కేసులు నమోదు చేసి పార్టీలకు అతీతంగా ఇటువంటి బెదిరింపులకు పాల్పడిన వారు ఏంతటివారైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.