Home Blog Page 3

రూ.10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే

హైదరాబాద్ సూర్య ప్రభా :ఆగస్టు 07గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమ యంలో ఉన్నారు.

దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధిం చిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు.

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్. బి.ఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టప రంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది.

ఇప్పటికే ఆర్.బి.ఐ పలు మార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేక సార్లు వ్యాపారులకు బ్యాంక ర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పది రూపా యల నాణేాలు విపణిలో చెల్లుబాటు అవుతాయని పది రూపాయల నాణాలను రద్దు చేశారంటూ అపోహలు వ్యాపింపచేయడం చటా రీత్యా నేరమని కూడా హెచ్చరించింది.

ఈ మేరకు 2016 లోనే ఆర్బిఐ పత్రిక ప్రకటన సైతం జారీ చేసింది. ఆ తర్వాత 2018 లో సైతం ఆర్బిఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో ఆర్బిఐ ఆదే శాలను బేఖాతరు చేస్తూ వస్తున్నారు.

దీంతో ఆర్బిఐ మరోసారి కఠినంగా హెచ్చరించేందుకు సిద్ధం సిద్ధమవుతుంది నిజానికి పది రూపాయల నోటు కన్నా పది రూపాయ ల నాణాలను స్వీకరించి నట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. పది రూపా యల నోట్లు వాడకం ఎక్కువగా ఉండటం వల్ల అవి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది.

వీటిని దృష్టిలో ఉంచుకొని విలువ తక్కువగా ఉన్న కారణంగా పది రూపాయల నాణాలను ఆర్బిఐ ప్రవేశ పెట్టింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో అపో హలను నమ్మి, కస్టమర్ల వద్ద నుంచి పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తున్నారు.

దీంతో పెద్ద ఎత్తున బ్యాంకులు ఆర్బీఐ చెస్టులో చినిగిన నోట్లతో పాటు రూ. 10 నాణేలను కూడా జమ చేయాల్సి వస్తోందని బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు. అంతేకాదు ఆర్బిఐ ఇప్పటికీ పది రూపాయల నాణాలను పెద్ద ఎత్తున ముద్రిస్తోంది.

భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

జమ్ము కాశ్మీర్ సూర్య ప్రభా :ఆగస్టు 07జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది.

రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం అణువణువునా గాలిస్తు న్నారు. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకూ సమాచారం లేదు.

దీనికిముందు అనంత్‌ నాగ్‌లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశాయి…

నకిలీ వైద్యులు అరెస్ట్….

వరంగల్,నర్సంపేట సూర్య ప్రభా : ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు నర్సంపేటలో ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు. తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు పట్టణానికి చెందిన కె. విజయేందర్ రెడ్డి, ఎన్. శ్యామ్ రాజ్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎలాంటి అర్హత లేకుండా వచ్చి రాని వైద్యం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ నరేశ్ హెచ్చరించారు…

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి

హైదరాబాద్ సూర్య ప్రభా:ఆగస్టు 07 తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషిం గ్టన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌ బృందం.. ఇవాళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం కానుంది.అమెరికాలో సీఎం రేవంత్‌ రెడ్డి టీమ్‌ పర్యటన కొసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటోంది. నిన్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌తో ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్‌ బృందం.. తాజాగా మరి కొన్ని కంపెనీలతోనూ డీల్‌ కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే.. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా ఆపరేషన్స్‌లో ఆర్సీసీయం హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు ముందు కొచ్చింది. ఆర్సీసీయం సీఈవో గౌరవ్‌సూరి, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌ బృందం జరిపిన చర్చల్లో కంపెనీ ఏర్పాటు ఒప్పందం కుదిరింది.ఇక.. అమెరికా వెలువల తొలిసారి హైదరాబాద్‌లో కంపెనీ చేయబోతున్నట్లు ఆర్సీసీయం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ సాయం తో తమ సేవలను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గొప్ప టాలెంట్‌ ఫోర్స్‌, సహజసిద్ధ లొకేషన్‌, స్కిల్స్‌ కలిగిన ఎంప్లాయిస్‌ అందు బాటులో ఉండడంతో హైదరాబాద్‌లో డేటా సొల్యూషన్‌ సర్వీసులను అభివృద్ధి చేస్తున్నామ న్నారు ఆర్సీసీయం సీఈవో గౌరవ్‌ సూరి. దాంతో.. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500మంది అత్యాధునికి సాంకేతిక నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు…

బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత

ఆగస్టు 6 : ఢిల్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ ను ఆగస్ట్ 6న వెనక్కి తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు సూచన మేరకు కవిత పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.

సూర్య ప్రభా: ఆగస్టు 6 : ఢిల్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ ను ఆగస్ట్ 6న వెనక్కి తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు సూచన మేరకు కవిత పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టు ఢీఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఆగస్ట్ 5న ట్రయల్ కోర్టు విచారించింది. అయితే వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ సందర్భంగా జడ్జి కావేరి బవేజా కీలక వ్యాఖ్యలు చేశారు.. వాదనలు వినిపించకపోతే పిటిషన్ వెనక్కి తీసుకోండి..డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై లాస్ట్ చాన్స్ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం పిటిషన్ విచారణను ఆగస్ట్ 7 కు వాయిదా వేశారు. అయితే ఇవాళ కోర్టులో కవిత డీఫాల్ట్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవం గమనార్హం…

చీల్చిచెండాడుతా’ అన్న కేసీఆర్‌‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం..

హైదరాబాద్ సూర్య ప్రభా : తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని… అందరినీ వెన్నుపోటు పొడిచిందని.. ఈ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

దీనిపై రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘‘ఎన్నికలైపోయాయి, ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండి. కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చా’’ అంటూ సీఎం సెటైర్ విసిరారు.

అలాగే… కేటీఆర్‌కు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లకు పోలిక ఉందని.. కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్నా పర్సెంట్ ఇంటిలిజెన్స్ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు ఓపిక, సహనం ఉండాలని సలహా ఇచ్చారు.

కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. సూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి.. ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు’’ అని అన్నారు. పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారన్నారు

మేమేమీ మీలాగా చెప్పలేదు…

బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందన్నారు. నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారని తెలిపారు.

బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే తాము చెల్లించామన్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారని.. సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారని ఆరోపించారు. ఎయిర్ పోర్టుకు ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం చేబితే వద్దని కేసీఆర్, కేటీఆర్ తిరస్కరించారన్నారు

ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలన్నారు. తామెప్పుడు పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పలేదని… హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదని అన్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ రేపు ప్రారంభిస్తామన్నారు. టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నామని… ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఏషియన్‌ గేమ్స్‌ నిర్వహించిన హైదరాబాద్‌లో అన్ని స్టేడియంలు , ఆట స్థలాలు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయన్నారు. ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వందకోట్ల మంది సంబరపడే పరిస్థితి ఉందన్నారు. నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి గత బీఆర్‌ఎస్ సర్కార్ ఇవ్వలేదని మండిపడ్డారు.

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 68,990గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 68, 990గా ఉంది.

హైదరాబాద్ సూర్య ప్రభా: హైదరాబాద్: బంగారం అంటే మహిళలకు మక్కువ ఎక్కువ. వివిధ ఆభరణాలు ధరించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో డిఫరెంట్ జ్యువెల్లరి ధరించి ధగధగ మెరుస్తుంటారు. ఆషాఢ మాసంలో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత తులం బంగారంపై రూ.10 వేల వరకు తగ్గింది. వచ్చేది శ్రావణ మాసం, అందులో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఇంకేముంది ఆ సమయంలో శుభకార్యాల కోసం కొందరు ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తున్నారు. బంగారం కొని, ఆభరణాలకు ఆర్డర్ ఇస్తున్నారు. సోమవారం రోజున బంగారం ధర మరింత తగ్గింది. ముందు ముందు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.65 వేల వరకు తగ్గొచ్చని వివరించారు. హైదరాబాద్‌లో ఇలా..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 68,990గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 68, 990గా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది. ఢిల్లీ, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400గా ఉంది. ఢిల్లీలో ఇలా..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,390గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 69,140గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.68,990గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,640గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 70,520గా ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.68,990గా ఉంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమావారి జన్మదిన మరియు శాఖంబరి అలంకరణ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ సూర్య ప్రభా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి జగద్గిరిగుట్ట లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మరియు శాఖంబరి అలంకరణ కార్యక్రమం సందర్బంగా దేవస్థాన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.ఈ కార్యక్రమం లో మహేందర్,కైలాసం గుప్త,రేగూరి ప్రవీణ్ గుప్త,ఉప్పల రమేష్ గుప్త,నేతి శంకర్ గుప్త,లక్ష్మణ్ రావు గుప్త,సురేష్ గుప్త, వీరేందర్ గుప్త,స్వామి గుప్త, సత్యనారాయణ గుప్త,నరసయ్య గుప్త,కృష్ణ మూర్తి గుప్త,నర్సింహా గుప్త,ఉపేందర్ గుప్త,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, సాయిలు, నాగదీప్ గౌడ్, మహేష్, శ్రవణ్, శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ చెక్కులు పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ సూర్య ప్రభా: బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మంజూరైన బిల్లుల చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి .కోటగిరి మండల కేంద్రం AS ఫంక్షన్ హాల్లో మరియు బాన్సువాడ పట్టణంలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ బిల్లు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు.

ఈసందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ……..

రాష్ట్రంలో అత్యధికంగా 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ.ఇందులో 4000 ఇళ్ళను కాంట్రాక్టర్ల ద్వారా నిర్మిస్తే, మిగతా 7000 ఇండ్లను లబ్ధిదారులు స్వంతంగా కట్టుకున్నారు.స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టుకునే GO ఈరోజుకు కూడా రాష్ట్రంలో లేదు. అయినా మొండి దైర్యం, పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో బాన్సువాడ నియోజకవర్గంలో నేను మొదలు పెట్టాను.పేదలు కట్టుకుని సంతోషంగా ఉన్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన బిల్లులు గత ప్రభుత్వంలో 93 శాతం వచ్చాయి.ఇంకా కేవలం ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి.నేను కాంగ్రెస్ పార్టీలో చేరే రోజు కూడా బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరాను.రైతులకు రుణమాఫీ అమలు జరుగుతున్న కఠిన పరిస్థితులలో కూడా ప్రస్తుతం ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.బిల్లులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు.కొద్ది రోజుల్లోనే మిగితావి కూడా వస్తాయి. లబ్ధిదారులకు అందిస్తాం.గత పదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఇంకా కొన్ని పనులు మధ్యలో ఉన్నాయి. నేను రిటైర్ అయ్యే లొపు మొదలు పెట్టిన పనులు పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే నా ఆశయం. పార్టీ మారే రోజు కూడా నాకు మంత్రి పదవి అవసరం లేదు, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వమని కోరాను. ముఖ్యమంత్రి అంగీకరించారు.పార్టీ మారడంలో నాకు ఎలాంటి స్వార్థం లేదు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను.

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్… రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదు

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్… రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్ సూర్య ప్రభా : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మోగనున్న ఎన్నికల నగారా! గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని అధికారులకు సూచించారు.ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించిది ప్రభుత్వం.పంచాయతీరాజ్ పై ముగిసిన సీఎం సమీక్షకొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి.ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించిన సీఎం.బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.ఈ నెల 4తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్ ముగిసింది. మండల పరిషత్ ల బాధ్యతలను ఎంపీడీఓ పై ర్యాంక్ అధికారులకు, జిల్లా పరిషత్ ల బాధ్యతలను కలెక్టర్లు, అదరపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం.మరి వేచి చూడాల్సిందే ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరు గెలుస్తారో…