Home Blog Page 5

ఏ.సీ.బీ కి చిక్కిన ఎసై,జర్నలిస్టు

మెదక్ (సూర్య ప్రభా) లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏ.సీ.బీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు.మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. బిక్కనూర్ కు చెందిన “మెట్రో ఈవినింగ్ జర్నలిస్టు మస్తాన్ మధ్యవర్తి గా ఉన్నాడు.బాధితుడి పిర్యాదు మేరకు ఏ.సీ.బీ అధికారులు లంచం తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి75వ జయంతి సందర్బంగా ఘన నివాళులర్పించిన కోలన్ హనుమంత్ రెడ్డి

జన హృదయ నేత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి75వ జయంతి సందర్బంగా ఘన నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి..

కుత్బుల్లాపూర్ (సూర్యప్రభా) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దివంగతనేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి75వ జయంతిని పరిష్కరించుకొని షాపూర్ నగర్ చౌరస్తాలో వైయస్సార్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ . ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ,ఉచిత విద్యుత్తు వంటి గొప్ప పథకాలను మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు డా.వైఎస్ఆర్ ఎప్పటికి తమ గుండెల్లో పెట్టుకుంన్నారు . పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరువులు వైయస్సార్ అభిమానులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, యూత్ & ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, ఎస్ సి & ఎస్ టి సెల్ నాయకులు, ఐ ఎన్ టీ యు సి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా పాల్గొన్నారు..

మహిళా సాధికారతతోనే కుటుంబ స్థితిగతులు మారుతాయి : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద …

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోసోమవారం 129 – సూరారం డివిజన్ అంబేద్కర్ ఎస్సీ మహిళా కమ్యూనిటీ హాల్ భవనం నందు స్వయం శక్తి గాజులరామారం పట్టణ మహిళా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే అటు దేశం, ఇటు కుటుంబం పురోగతి సాధిస్తుందన్నారు. అంతేకాక మహిళలంతా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అందరికీ తెలియజేస్తూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఎర్వ శంకరయ్య, మాజీ కౌన్సిలర్ కిషన్ రావ్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు భాస్కర్, మద్దెల సత్యనారాయణ, ప్రశాంత్, మహిళా సంఘం నాయకురాలు దేవ కరుణ, సంధ్య, షబానా, భ్రమరాంబ, అరుణ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

భూదేవి హిల్స్ లో భూకబ్జాదారుల ఆక్రమణకు గురైన పరికి చెరువు, స్మశాన వాటికలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)జగద్గిరిగుట్ట, భూదేవి హిల్స్ లో బాలకృష్ణ అనే భూకబ్జా దారుడు పరికి చెరువు ఎఫ్ టి ఎల్ ని ఆక్రమించి,స్మశాన వాటికలను ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నాడనని స్థానికులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకురాగా, ఆదివారం స్థానికులతో కలిసి పరికి చెరువును మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ సందర్శించి, ఆక్రమణలను పరిశీలించారు. సుమారు 500 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, స్మశాన వాటికలో ప్రయివేటుగా రోడ్లు వేసి, ప్లాట్లుగా చేసి లక్షల రూపాయలకి అమాయక ప్రజలకు అమ్ముతున్నారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి వివరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూముల రక్షణకు కృషి చేయాలని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తానని, చెరువులను కాపాడతానని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఆర్ఐ రజనీకాంత్, సీనియర్ నాయకులు రషీద్, మోతె శ్రీనివాస్ యాదవ్, గణేష్, ఓరుగంటి నరేష్ గౌడ్, గుమస్తా మధుసూదన్, నరేందర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ. 2,50,000/- CMRF – LOC మంజూరు పత్రాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్…

కుత్బుల్లాపూర్ (సూర్యప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ, ఉమామహేశ్వర కాలనీకి చెందిన భారతి కుమార్తె సౌజన్య కుమారి కిడ్నీ సంబంధిత వ్యాధితో భాధపడుతుండడంతో, ఆమె తల్లి భారతి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆశ్రయించగా, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సత్వరమే స్పందించి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను బాధితురాలి తల్లి భారతికి ఈరోజు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ బైరి ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు పూర్ణచంద్రరావు, వరుణ్ రాజ్, భాస్కర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ ఆలయ 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపల్ పరిధి చర్చ్ గాగిల్లాపూర్ లోని చైతన్య కాలనీలో శుక్రవారం శ్రీ అభయాంజనేయ ఆలయ 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .ఈ సందర్భంగా ఆలయంలో ప్రతేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, శంకర్ నాయక్, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కుంటి నాగరాజు, జక్కుల శ్రీనివాస్ యాదవ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ నల్తురి క్రిష్ణ, పాక్స్ డైరెక్టర్ జీతయ్య, నాయకులు మొర అశోక్, కొర్ర రవీందర్ నాయక్, శ్రీనివాస్, నరేందర్ నాయక్, మల్లేష్, శివ నాయక్, కాలనీ సభ్యులు ఫణి తేజ, శ్రీహరి, శ్రీనివాస్, సుబ్బరాజు, బీవీ రావు, రాంబాబు, వెను, దీపు, శ్రీకాంత్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు…

శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్బంగా అన్నదాన కార్యక్రమం

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం మెయిన్ రోడ్ లో శ్రీ వాసవి సేవాదళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.ఈ కార్యక్రమం లో శ్రీ వాసవి సేవాదళ్ సభ్యులు పడకంటి వెంకటేశం, తోట బిక్షపతి, పల్ల నాగరాజు, ఉప్పల రమేష్, ఉప్పల నాగరాజు, శివ కుమార్, శ్రీనివాస్, రాజు, సాయిలు,చక్రి,నందు గౌడ్, అరవింద్, సతీష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

127 డివిజన్ పోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) రంగారెడ్డి నగర్ 127 డివిజన్, విజయనగర్ కాలనీ లోని పోచమ్మ ఆలయంలో జరిగిన మండల పూజ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ హాజరై, అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయనగర్ కాలనీ అధ్యక్షుడు ఎండి రియాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తోకల శీను, శ్రీధర్, నరసింహా గౌడ్, సుధాకర్ గౌడ్, ఏలేష్, మదన్ గౌడ్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, భాస్కరరావు, చిలక సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..

maji mla srisaylam goud

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అశ్రద్ధ వహించకూడదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలం గౌడ్ ని వివిధ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు, పలువురు కార్యకర్తలు తన నివాసం వద్ద కలిశారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. పలువురు పలు ఆహ్వాన పత్రికలు మాజీ ఎమ్మెల్యే కి అందజేశారు.

గాజులరామారంలో ఘనంగా వంగవీటి మోహన రంగ 77 జయంతి వేడుకలు

vangaviti ranga