కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అశ్రద్ధ వహించకూడదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలం గౌడ్ ని వివిధ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు, పలువురు కార్యకర్తలు తన నివాసం వద్ద కలిశారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. పలువురు పలు ఆహ్వాన పత్రికలు మాజీ ఎమ్మెల్యే కి అందజేశారు.