
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపల్ పరిధి చర్చ్ గాగిల్లాపూర్ లోని చైతన్య కాలనీలో శుక్రవారం శ్రీ అభయాంజనేయ ఆలయ 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .ఈ సందర్భంగా ఆలయంలో ప్రతేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, శంకర్ నాయక్, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కుంటి నాగరాజు, జక్కుల శ్రీనివాస్ యాదవ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ నల్తురి క్రిష్ణ, పాక్స్ డైరెక్టర్ జీతయ్య, నాయకులు మొర అశోక్, కొర్ర రవీందర్ నాయక్, శ్రీనివాస్, నరేందర్ నాయక్, మల్లేష్, శివ నాయక్, కాలనీ సభ్యులు ఫణి తేజ, శ్రీహరి, శ్రీనివాస్, సుబ్బరాజు, బీవీ రావు, రాంబాబు, వెను, దీపు, శ్రీకాంత్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు…