కుత్బుల్లాపూర్ (సూర్యప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ, ఉమామహేశ్వర కాలనీకి చెందిన భారతి కుమార్తె సౌజన్య కుమారి కిడ్నీ సంబంధిత వ్యాధితో భాధపడుతుండడంతో, ఆమె తల్లి భారతి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆశ్రయించగా, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సత్వరమే స్పందించి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను బాధితురాలి తల్లి భారతికి ఈరోజు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ బైరి ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు పూర్ణచంద్రరావు, వరుణ్ రాజ్, భాస్కర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Home తాజా వార్తలు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ. 2,50,000/- CMRF – LOC మంజూరు పత్రాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్…