Home తాజా వార్తలు భూదేవి హిల్స్ లో భూకబ్జాదారుల ఆక్రమణకు గురైన పరికి చెరువు, స్మశాన వాటికలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

భూదేవి హిల్స్ లో భూకబ్జాదారుల ఆక్రమణకు గురైన పరికి చెరువు, స్మశాన వాటికలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

0

కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా)జగద్గిరిగుట్ట, భూదేవి హిల్స్ లో బాలకృష్ణ అనే భూకబ్జా దారుడు పరికి చెరువు ఎఫ్ టి ఎల్ ని ఆక్రమించి,స్మశాన వాటికలను ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నాడనని స్థానికులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకురాగా, ఆదివారం స్థానికులతో కలిసి పరికి చెరువును మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ సందర్శించి, ఆక్రమణలను పరిశీలించారు. సుమారు 500 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, స్మశాన వాటికలో ప్రయివేటుగా రోడ్లు వేసి, ప్లాట్లుగా చేసి లక్షల రూపాయలకి అమాయక ప్రజలకు అమ్ముతున్నారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి వివరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూముల రక్షణకు కృషి చేయాలని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తానని, చెరువులను కాపాడతానని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఆర్ఐ రజనీకాంత్, సీనియర్ నాయకులు రషీద్, మోతె శ్రీనివాస్ యాదవ్, గణేష్, ఓరుగంటి నరేష్ గౌడ్, గుమస్తా మధుసూదన్, నరేందర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here