Home తాజా వార్తలు ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

0

కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా
దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, శంబిపూర్ కృష్ణ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ దేవీ నవరాత్రులలో భాగంగా బుధవారం అమ్మవారు సరస్వతి అవతారంలో ఉంటూ విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లిగా పూజలందుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అర్కల అనంతస్వామి, స్థానిక బస్తీ వాసలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here