అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్జరీలు మరింత సులభతరంగా మారాయి : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …
కుత్బుల్లాపూర్ (సూర్యప్రభా) :
ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ నందకా అడ్వాన్స్ సర్జరీ సెంటర్ ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ…. నేటి రోజులలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్జరీలు మరింత సులభతరంగా మారాయని, చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా వేగంగా రికవరీ అయ్యేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యేలు కెపి.వివేకానంద్ , మల్లా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపల్ వార్డ్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా విభాగం నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు – సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు